Andre Russell Bids Emotional Farewell to IPL: ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన డేంజరస్ ప్లేయర్
గుడ్ బై చెప్పిన డేంజరస్ ప్లేయర్

Andre Russell Bids Emotional Farewell to IPL: కోల్‌కతా నైట్ రైడర్స్ లెజెండరీ ఆల్-రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆటగాడిగా వైదొలగినా, ఆయన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీతోనే ఉండనున్నారు. IPL 2026 సీజన్ నుంచి ఆయన 'పవర్ కోచ్' గా కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నారు.
వేరే IPL జట్టు జెర్సీలో తనను తాను చూసుకోవడం కష్టమనిపించిందని, కేకేఆర్ పట్ల తనకున్న విధేయత కారణంగానే రిటైర్మెంట్ తీసుకున్నానని రస్సెల్ తెలిపారు. ఆటగాడిగా శిఖరాగ్రంలో ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్లు ఆయన పేర్కొన్నారు. రస్సెల్ తన విధ్వంసక బ్యాటింగ్ ,డెత్ ఓవర్లలోని అద్భుతమైన బౌలింగ్‌తో కేకేఆర్కు ఎన్నో విజయాలు అందించారు. ఇది ఐపీఎల్ లో ఒక శకం ముగిసినట్లుగా భావించవచ్చు, కానీ ఆయన కొత్త పాత్రలో జట్టుకు సేవలు అందించనున్నారు.
కోల్ కతా తరపున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్ 140 మ్యాచ్ లు ఆడాడు. 2651 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 88, 123వికెట్లు తీశాడు. ఒకసారి ఐదు వికెట్లు తీశాడు రస్సెల్

