ఆశ్చర్యంగా ఉంది

Anil Kumble: జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుంచి రాజస్థాన్ రాయల్స్ (RR)కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోవడంపై అనిల్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సాధారణంగా, సీఎస్‌కే తమ ఆటగాళ్లను వదులుకోదు ముఖ్యంగా జడేజా లాంటి నాణ్యత కలిగిన, వారితో చాలా కాలంగా అనుబంధం ఉన్న ఆటగాడిని వదులుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది" అని కుంబ్లే అన్నారు.

జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు (RR) వెళ్లడం పెద్ద ట్రేడ్ అని పేర్కొంటూ, జడేజాకు RR కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా అనే ప్రశ్న లేవనెత్తారు."రాజస్థాన్‌కు కెప్టెన్సీ పెద్ద ప్రశ్నగా మారింది. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, శామ్ కరన్ వంటి ఎంపికలు ఉన్నప్పటికీ, రవీంద్ర జడేజా నాయకత్వ పాత్రకు మరో ఆసక్తికరమైన అవకాశం" అని కుంబ్లే అభిప్రాయపడ్డారు.జడేజా బదిలీతో, సీఎస్‌కే తమ జట్టును వేగంగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, వయసు పైబడిన ఆటగాళ్లపై ఆధారపడటం కంటే యువకులకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని కుంబ్లే సూచించారు.

జడేజా బ్యాటింగ్ నైపుణ్యం పెరగడం వల్లనే అతను భారత జట్టులో మరింత ముందుకు ప్రమోట్ అయ్యాడని, ఇది జట్టుకు చాలా బలంగా మారిందని కుంబ్లే పేర్కొన్నారు.జడేజాకు అసాధారణమైన ప్రతిభ ఉంది. అతను సౌరాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. అతని బౌలింగ్ నాణ్యత అందరికీ తెలుసు, కానీ అతని నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శనలు భారత్ ఈ స్థితిలో ఉండటానికి ఖచ్చితంగా సహాయపడ్డాయి" అని కుంబ్లే ప్రశంసించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story