celebrity couple : విడిపోనున్న మరో సెలబ్రిటీ జంట
సపరేట్ అవుతున్న సైనానెహ్వాల్, కశ్యప్ పారుపల్లిలు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ జంట విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టా అకౌంట్ లో వెల్లడించారు. కశ్యప్ పారుపల్లితో తన ప్రయాణం ముగిసినట్లుగా సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అన్ని విషయాలు ఇద్దరం కలసి చర్చించుకునే ఒక అవగాహనతో ఎవరి దారిలో వారు వెళ్ళాలని నిర్ణయిం తీసుకున్నట్లు సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. 2014 డిసెంబర్ 14వ తేదీన సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ లు వివాహం చేసుకున్నారు. ఈ ఏడేళ్ళ వైవాహిక జీవితంత వారిద్దరి మద్య ఎటువంటి పొరపచ్చలు ఉన్నట్లుగానీ, వివాదాలు రేగినట్లుగానీ ఏ సందర్భంలోనే బహిర్గతం కాలేదు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. వీరిద్దరికీ హృషీకేష్ అనే నాలుగు సంవత్సరాల వయసు గల కుమారుడు ఉన్నాడు. అటువంటిది ఇప్పుడు హఠాత్తుగా ఇద్దరం విడిపోతున్నామని సైనా నెహ్వాల్ ప్రకటించడంతో క్రీడాలోకం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
