మరో రికార్డ్..

Rohit Sharma’s Record: భారత్ vs సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లోని రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సాధించాడు.రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ స్వదేశీ పిచ్‌లపై అంతర్జాతీయ మ్యాచ్‌లలో 9,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

ఈ ఘనత సాధించిన నాల్గవ భారతీయ బ్యాటర్ గా రోహిత్ రికార్డు సృష్టించారు.ఈ క్రమంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (9004 పరుగులు) రికార్డును ఆయన అధిగమించారు.తొలి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 313 ఇన్నింగ్స్‌లలో 14192 పరుగులతో టాప్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (254 ఇన్నింగ్స్ లలో 12373 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌కి ముందు, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 20,000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 41 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి.అయితే, ఈ రెండో వన్డేలో ఆయన కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.దీంతో, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న నాల్గవ భారతీయుడిగా నిలిచే అవకాశం తృటిలో తప్పింది.

తొలి వన్డేలో రోహిత్ శర్మ పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక వన్డే సిక్సర్ల (351) రికార్డును బద్దలు కొట్టి, ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story