రెండోసారి టైటిల్ కొట్టిన సబలెంకా

Aryna Sabalenka: యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అరీనా సబలెంక అద్భుతమైన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అరీనా సబలెంక, అమెరికాకు చెందిన అమాండా అనిసిమోవాను 6-3, 7-6 (7-3) స్కోరుతో నేరుగా సెట్లలో ఓడించి విజయం సాధించింది.

ఇది సబలెంకకు వరుసగా రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ విజయంతో, ఆమె 2012-2014 మధ్య సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన మొదటి మహిళగా నిలిచింది. ఇది సబలెంక కెరీర్‌లో నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇంతకుముందు ఆమె 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ,2024 యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకుంది.

ఈ విజయం 2025లో సబలెంకకు మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ సంవత్సరంలో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓటమి తర్వాత ఈ విజయం లభించడంతో ఆమెకు చాలా ప్రత్యేకమైందిగా మారింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం సబలెంక తన బాయ్‌ఫ్రెండ్ అయిన జార్జియోస్ ఫ్రాంగులిస్‌తో ఆనందాన్ని పంచుకుంది. 2024లో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ కాన్‌స్టాంటిన్ కోల్త్సోవ్ మరణం తర్వాత కష్టకాలంలో ఫ్రాంగులిస్ ఆమెకు అండగా ఉన్నారని సబలెంకా వెల్లడించింది.ఈ సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story