Ashes: హెడ్,స్మిత్ సెంచరీల మోత.. ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం
ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం

Ashes: ఇంగ్లండ్‌తో యాషెస్ ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం అందుకుంది. ట్రావిస్ హెడ్ (163), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (129 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగడంతో.. మంగళవారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 124 ఓవర్లలో 518/7 స్కోరు చేసింది. స్మిత్‌తో పాటు బ్యూ వెబ్‌స్టర్ (42 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 166/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన హెడ్ ఆరంభంలో ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. తర్వాత వచ్చిన స్మిత్ కూడా డే చివరి వరకు క్రీజులో నిలిచి కీలక భాగస్వామ్యాలతో భారీ స్కోరు అందించాడు. నాలుగో వికెట్‌కు 54 రన్స్ జోడించి హెడ్ వెనుదిరిగాడు. ఉస్మాన్ ఖవాజా (17), అలెక్స్ కెరీ (16) నిరాశపర్చినా.. స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. కామెరాన్ గ్రీన్ (37)తో ఏడో వికెట్‌కు 71, వెబ్‌స్టర్‌తో ఎనిమిదో వికెట్‌కు 81 రన్స్ జోడించాడు. కార్స్ 3, స్టోక్స్ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఆసీస్ 134 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

