Ashes Series: ఒకే రోజు 20 వికెట్లు.. 131 ఏళ్ల రికార్డు బద్దలు
131 ఏళ్ల రికార్డు బద్దలు

Ashes Series: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్ట్) ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ప్రస్తుతం రెండో రోజు ఆట కొనసాగుతోంది. తొలి రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లు ఊహించని రీతిలో చెలరేగడంతో ఒకే రోజులో 20 వికెట్లు నేలకూలి 131 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్, ఇంగ్లాండ్ పేసర్ జోష్ టంగ్ (5/45) ధాటికి కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. మైఖేల్ నేసర్ (35), ఉస్మాన్ ఖవాజా (29) మాత్రమే కాస్త పోరాడారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ కూడా ఆసీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 110 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆసీస్ బౌలింగ్ లో మైఖేల్ నేసర్ 4 వికెట్లు, స్కాట్ బోలాండ్ 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 44 పరుగులు చేసింది.
ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి మూడు టెస్టులు గెలిచి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నాలుగో టెస్టులో కూడా గెలిచి క్లీన్ స్వీప్ దిశగా వెళ్లాలని ఆసీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ ఫలితం ఇవాళ తేలే అవకాశం ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు.

