జట్టులోకి అశ్విన్.!

Ravichandran Ashwin: క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) బిగ్ బాష్ లీగ్ (BBL) లో సిడ్నీ థండర్స్ జట్టు తరపున రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగనున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయ అంతర్జాతీయ ఆటగాడు అశ్వినే అవుతాడు.అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ప్రస్తుతం అశ్విన్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఆ టోర్నీ ముగిసిన తర్వాత జనవరిలో సిడ్నీ థండర్స్‌ జట్టులో చేరతాడని మీడియా వర్గాలు తెలిపాయి.అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్ అయ్యారు, దీంతో అతను విదేశీ T20 లీగ్‌లలో ఆడటానికి మార్గం సుగమమైంది. సిడ్నీ థండర్స్ జట్టుకు అతని చేరిక ఒక పెద్ద బలాన్ని ఇస్తుంది.

అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టులో వేగంగా 400, 450, 500 టెస్ట్ వికెట్లు సాధించిన రెండవ భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు.టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అశ్విన్ కేవలం బౌలర్‌గా కాకుండా, టెస్ట్ క్రికెట్‌లో ఐదు సెంచరీలు సాధించి ఒక మంచి బ్యాట్స్‌మన్‌గా కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు. దీంతో అతను ఒక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story