Asia Cup 2025: ఆఫ్గనిస్థాన్‌పై బంగ్లాదేశ్ గెలుపు
బంగ్లాదేశ్ గెలుపు

Asia Cup 2025: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తరపున తన్జిద్ 52, సైఫ్ 30, తౌహిద్ 26 రాణించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్, నూర్ అహ్మద్‌లకు చెరో 2, అజ్మతుల్లా ఒక వికెట్ తీశారు.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో146 రన్స్‌కు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్లలో గుర్బాజ్ 35, అజ్మతుల్లా 30, రషిద్ 20 మినహా ఎవరూ మంచిగా రాణించలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజుర్ 3, నసుమ్, తస్కిన్, రిషద్‌లకు తలో వికెట్ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 154/5 (తన్జిద్ హసన్ 52, సైఫ్ హసన్ 30, రషీద్ 2/26, నూర్ అహ్మద్ 2/23). అఫ్గానిస్తాన్: 20 ఓవర్లలో 146 ఆలౌట్ (రెహమానుల్లా గుర్బాజ్ 35, ఒమర్‌జాయ్ 30, ముస్తాఫిజుర్ 3/28).
