మరోసారి హై ఓల్టేజ్ మ్యాచ్

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-Aలో భారత్ తర్వాత రెండో జట్టుగా ఈ ఘనత సాధించింది.

సెప్టెంబర్ 17న దుబాయ్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించి సూపర్-4 బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

పాకిస్తాన్20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఓపెనర్ ఫకర్ జమాన్ 36 బంతుల్లో 50 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. చివరిలో షహీన్ అఫ్రిది కేవలం 14 బంతుల్లోనే 29 పరుగులు చేసి స్కోరును పెంచాడు.యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిఖ్ (4 వికెట్లు), సిమ్రన్‌జీత్ సింగ్ (3 వికెట్లు) అద్భుత ప్రదర్శన చేశారు.

టార్గెట్ బరిలో 17.4 ఓవర్లలో 105 పరుగులకు యూఏఈ ఆలౌట్ అయింది. బౌలింగ్ లో రాణఇంచినా బ్యాటింగ్‌లో జట్టును గెలిపించలేకపోయారు. పాకిస్తాన్ బౌలింగ్ లో షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్,హారిస్ రౌఫ్ తలో రెండు వికెట్లు తీసి యూఏఈ బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.

ఈ విజయంతో గ్రూప్-Aలో భారత్ అగ్రస్థానంలో, పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచాయి. సూపర్-4 దశలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

దీంతో ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రెండోసారి హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తే, ఈ టోర్నీలో మూడోసారి తలపడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story