Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయిన పాక్
మరోసారి రెచ్చిపోయిన పాక్

Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయింది పాక్. పాక్ బ్యాట్స్‌మెన్ పర్హాన్ 50 పరుగుల సెలబ్రేషన్ వివాదాస్పదంగా మారింది. హాఫ్ సెంచరీ తర్వాత పర్హాన్ గన్‌ఫైరింగ్ సెలబ్రేషన్స్ చేశాడు. పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ పర్హాన్ సెలబ్రేషన్స్ చేశాడు. పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ పర్హాన్ సెలబ్రేషన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇండియా డగౌట్ వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడంపై..భారత అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత బ్యాట్స్‌మెన్ అభిషేక్, గిల్ ఆటతో... పాక్ ప్లేయర్లు సహనం కోల్పోయారు. మ్యాచ్ మధ్యలో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అభిషేక్ టార్గెట్‌గా రౌఫ్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. దీంతో కోపంగా ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు అభిషేక్, రౌఫ్. వెంటనే ఇద్దరు ప్లేయర్లను అంపైర్ వారించారు. కాగా సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది భారత్. పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఆసియాకప్ 2025లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో పాక్ పై భారత్ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20 వరల్డ్ కప్ నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.
