హకీ కెప్టెన్ గా సలీమా

Asia Cup 2025: వచ్చే నెలలో చైనాలో జరగనున్న మహిళల హాకీ ఆసియా కప్‌ 2025 కోసం హాకీ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుండి 14 వరకు హాంగ్జౌలో జరగనుంది.

మిడ్‌ఫీల్డర్ సలీమా టేటే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మొత్తం 20 మంది క్రీడాకారిణులతో కూడిన జట్టును హాకీ ఇండియా ఎంపిక చేసింది.ఈ టోర్నమెంట్ 2026లో జరిగే ప్రపంచ కప్‌కు క్వాలిఫయర్‌గా పనిచేస్తుంది. ఆసియా కప్‌ విజేత నేరుగా ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది. మాజీ కెప్టెన్ , గోల్ కీపర్ సవిత పూనియాను ఈ జట్టు నుంచి పక్కన పెట్టడం గమనార్హం.

గతంలో భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్‌ను 2004, 2017లో గెలుచుకుంది. జూనియర్ మహిళల హాకీ జట్టు 2023లో తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అలాగే, 2024లో రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది.హాకీ ఫైవ్స్ ఆసియా కప్‌లో కూడా భారత జట్టు విజేతగా నిలిచి 2024 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

ఇండియా జట్టు

గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్స్‌‌‌: బన్సారీ సోలంకి, బిచు దేవి కరీబామ్‌‌‌‌‌‌‌‌, డిఫెండర్స్‌‌‌‌‌‌‌‌: మనీషా చౌహాన్‌‌‌‌‌‌‌‌, ఉదిత, జ్యోతి, సుమన్‌‌‌‌‌‌‌‌ దేవి తౌడమ్‌‌‌‌‌‌‌‌, నిక్కీ ప్రధాన్‌‌‌‌‌‌‌‌, ఇషికా చౌదరీ, మిడ్‌‌‌‌‌‌‌‌ఫీల్డర్స్‌‌‌‌‌‌‌‌: నేహా, వైష్ణవి విఠల్‌‌‌‌‌‌‌‌ పాల్కే, సలీమా టెటే (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), శర్మీలా దేవి, లాల్‌‌‌‌‌‌‌‌రెమిసియామి, సునెలిటా టోపో, ఫార్వర్డ్స్‌‌‌‌‌‌‌‌: నవ్నీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌, రుతుజా డాడసో పిసల్‌‌‌‌‌‌‌‌, బ్యూటీ డుంగ్‌‌‌‌‌‌‌‌డుంగ్‌‌‌‌‌‌‌‌, ముంతాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, దీపిక, సంగీతా కుమారి.

PolitEnt Media

PolitEnt Media

Next Story