వాళ్లకు చోటు కల్పించడం కష్టం

Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఇప్పటికే ఉన్న ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారికి ఉన్న పోటీ వల్ల, మేము చాలా కష్టపడి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి అద్భుతమైన ఆటగాళ్లకు కూడా చోటు దక్కలేదు. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా బాగా రాణించాడు. కానీ టీమ్‌లో ప్రస్తుతం మిడిల్ ఆర్డర్ స్థానాలకు చాలా మంది ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఉంది. ఇదే కారణం వల్ల అతన్ని జట్టులోకి తీసుకోలేకపోయాం.

సంజూ శాంసన్ పరుగుల వేటలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడని, అందుకే అతన్ని జట్టులో కొనసాగిస్తున్నామని అగార్కర్ అన్నారు.ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా , ఫినిషర్ రింకూ సింగ్ ల ఎంపిక గురించి అగార్కర్ మాట్లాడుతూ, ఈ ఇద్దరు ఆటగాళ్ళు వారి వారి పాత్రలలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నారని, వారి ప్రతిభ మీద తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.రింకూ సింగ్ ఒక అద్భుతమైన ఫినిషర్ అని, అందుకే అతన్ని బ్యాకప్ ఫినిషర్‌గా జట్టులోకి తీసుకున్నామని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story