Asia Cup: ఆసియాకప్ : శ్రీలంక కెప్టెన్ గా అసలంక
కెప్టెన్ గా అసలంక

Asia Cup: సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం శ్రీలంక 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు చరిత్ అసలంక కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల గాయం కారణంగా జింబాబ్వే సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా జట్టులోకి తిరిగి వచ్చాడు.
ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
శ్రీలంక జట్టు:
చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, నువానిదు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిషారా, దసున్ షనక, వానిందు హసరంగా,
దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో, నువాన్ తుషారా , మతిషా పతిరణ,
గ్రూప్ A:
భారత్
పాకిస్తాన్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)
ఒమన్
గ్రూప్ B:
శ్రీలంక
బంగ్లాదేశ్
ఆఫ్ఘనిస్తాన్
హాంకాంగ్
