Asia Cup: నిన్న జరిగిన మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్' (Women's Asia Cup Rising Stars 2026) ఫైనల్‌లో భారత్ 'ఎ' (India A) జట్టు, బంగ్లాదేశ్ 'ఎ' జట్టుపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ ఎ జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ 20 ఓవర్లలో 134/7 పరుగులు చేసింది. తేజల్ హసబ్నిస్ భారత్ తరపున అద్భుతమైన బ్యాటింగ్‌తో కేవలం 34 బంతుల్లోనే 51 పరుగులు* (నాటౌట్) చేసి జట్టును ఆదుకుంది. ఈమెకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. భారత కెప్టెన్ రాధా యాదవ్ 36 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని అందించింది.
టార్గెట్ లో బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌట్ అయింది. . షామిమా సుల్తానా (20) టాప్ స్కోరర్. సర్మిన్ సుల్తానా (18), ఫహిమా ఖాతున్ (14), సాదియా అక్తర్ (10) ఫెయిలయ్యారు. ప్రేమకు తోడుగా సోనియా మెందియా, తనుజా కన్వర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రేమ రావత్ బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో కూడా భారత్ 'ఎ' జట్టు బంగ్లాదేశ్‌పైనే గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. ఇది వరుసగా భారత్‌కు రెండో టైటిల్.


