సూపర్ 4లో లాస్ట్ మ్యాచ్ ఇండియా vs చైనా

Asia Cup Hockey 2025: హెచ్‌ఐఏ (హాకీ ఇండియా) ఆసియా కప్ 2025లో భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి సూపర్-4 మ్యాచ్‌లో నేడు చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్ బిహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరో సూపర్‌‌‌‌–4 మ్యాచ్‌‌‌‌లో మలేసియా కొరియాతో తలపడనుంది.

ఇండియాపై ఎలాంటి తప్పులు చేయకుండా అంచనాలను అందుకోవడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. భారత జట్టు ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి (మలేసియాపై 4-1), ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది (కొరియాతో 2-2). ఇప్పుడు సూపర్-4 పట్టికలో భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా లేదా గెలిచినా భారత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

చైనా కూడా సూపర్-4లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. వారు తమ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొరియాను 3-0తో ఓడించి సంచలనం సృష్టించారు. గతంలో ఈ రెండు జట్లు తలపడినపుడు చైనాపై భారత్ ముందంజలో ఉంది. అయినప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో చైనా బలమైన జట్టుగా కనిపిస్తుంది. ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడనున్నాయి. సూపర్​–4లో టాప్​–2లో నిలిచిన జట్ల మధ్య ఆదివారం ఫైనల్​ జరుగుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story