Asia Cup Hockey: ఇండియాదే ఆసియా కప్.. 8 ఏళ్ల తర్వాత టైటిల్
8 ఏళ్ల తర్వాత టైటిల్

Asia Cup Hockey: ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను భారత్ 4-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ మొదటి నిమిషం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. సుఖ్‌జీత్ సింగ్, దిల్ ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్ గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత్ 8 సంవత్సరాల తర్వాత ఆసియా కప్‌ను గెలుచుకుంది. దీనికి ముందు 2017లో భారత్ ఈ టైటిల్‌ను గెలిచింది. ఇది భారత్‌కు నాలుగవ ఆసియా కప్ టైటిల్. ఈ విజయంతో, భారత జట్టు 2026లో బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలలో జరగబోయే FIH హాకీ ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించింది.
బీహార్‌లోని రాజ్‌గిర్ నగరంలో జరిగిన ఈ టోర్నీలో భారత్ అపజయమన్నదే లేకుండా మొత్తం ఆరు మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని అజేయంగా నిలిచింది. మలేషియా మూడో స్థానంలో నిలిచింది.ఈ విజయం భారత హాకీ జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. రాబోయే ప్రపంచ కప్‌లో కూడా ఇదే ఆటతీరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
