✕
Asia Cup Hockey Tournament: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్: ఇవాళ్టి నుంచి సూపర్ 4
By PolitEnt MediaPublished on 3 Sept 2025 2:42 PM IST
ఇవాళ్టి నుంచి సూపర్ 4

x
Asia Cup Hockey Tournament: ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ సూపర్ 4 దశ ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్ కొరియాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.సూపర్ 4 దశలో ప్రతీ జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇందులో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ సెప్టెంబర్ 7న జరగనుంది.
సూపర్ 4 దశకు అర్హత సాధించిన జట్లు:
ఇండియా (పూల్-ఎ నుంచి అగ్రస్థానం)
చైనా (పూల్-ఎ నుంచి రెండో స్థానం)
మలేషియా (పూల్-బి నుంచి అగ్రస్థానం)
దక్షిణ కొరియా (పూల్-బి నుంచి రెండో స్థానం)
సూపర్ 4లో ఇండియా షెడ్యూల్:
సెప్టెంబర్ 3: ఇండియా వర్సెస్ దక్షిణ కొరియా (రాత్రి 7:30)
సెప్టెంబర్ 4: ఇండియా వర్సెస్ మలేషియా (రాత్రి 7:30 )
సెప్టెంబర్ 6: ఇండియా వర్సెస్ చైనా (రాత్రి 7:30 )

PolitEnt Media
Next Story