గిల్ కు చోటు దక్కేనా.?

Asia Cup Squad: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపిక ఈరోజు జరగనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

జట్టు ఎంపికలో కొన్ని కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు టీ20 జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఓపెనర్ స్థానాల కోసం గిల్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. అలాగే, పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారు.

ఈసారి ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్లో నిర్వహించబడుతుంది. భారత జట్టు గ్రూప్-Aలో యూఏఈ, పాకిస్తాన్, ఒమాన్ జట్లతో తలపడనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడుతుంది, సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో తలపడుతుంది.

ఈసారి జట్టు ఎంపికపై చాలా ఆసక్తి నెలకొంది, ఎందుకంటే ఇది వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్ 2026కి ఇది ప్రాక్టీస్ గా పరిగణించబడుతుంది.ఈ రోజు సాయంత్రం పూర్తి జట్టు వివరాలు తెలిసే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story