Asia Cup Trophy : ఆసియా కప్ ట్రోఫీ.. ఖచ్చితంగా భారత్ కు వస్తది
ఖచ్చితంగా భారత్ కు వస్తది

Asia Cup Trophy : ఆసియా కప్ (2025) ట్రోఫీని తమకు అప్పగించే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కూడా) మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది . ఈ క్రమంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వివాదంపై స్పందించారు. "గెలిచి నెల రోజులు దాటినా ట్రోఫీ మాకు ఇవ్వకపోవడంపై కాస్త అసంతృప్తితో ఉన్నాం. ఈ విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం.మేము ACC ఛైర్మన్ (నఖ్వీ) చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. అయితే, దాని అర్థం ఆ పెద్దమనిషి ట్రోఫీని తనతో పాటు తీసుకువెళ్లవచ్చని కాదు. ఇది చాలా దురదృష్టకరం , అన్-స్పోర్టింగ్‌గా ఉంది.
"పది రోజుల క్రితం ఏసీసీ ఛైర్మన్‌కు లేఖ రాశాం, అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. ఒకటి రెండు రోజుల్లో ట్రోఫీ ముంబైలోని మా కార్యాలయానికి చేరుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే, నవంబర్ 4న దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతాం.భారత ప్రజలకు నేను హామీ ఇస్తున్నా... ట్రోఫీ ఖచ్చితంగా భారత్‌కు వస్తుంది. కాస్త ఆలస్యం కావచ్చు అంతే. మేము ఛాంపియన్‌షిప్ గెలిచాం. అంతా రికార్డుల్లో ఉంది. ట్రోఫీ మాత్రమే లేదు. మంచి మనసు ప్రబలుతుందని ఆశిస్తున్నాను. నఖ్వీ చెప్పినట్లుగా, ట్రోఫీని తన చేతుల మీదుగా తీసుకోవడానికి బీసీసీఐ నుంచి ఎవరైనా దుబాయ్ వచ్చి వేడుకలో పాల్గొనాలనే ప్రతిపాదనను తాము అంగీకరించబోమని సైకియా స్పష్టం చేశారు.

