Asian Under-19 Boxing Championship: అండర్ 19 బాక్సింగ్.. ఇండియాకు 14 మెడల్స్
ఇండియాకు 14 మెడల్స్

Asian Under-19 Boxing Championship: ఆసియా అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున మొత్తం మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం 14 పతకాలు (3 బంగారం, 7 వెండి, 4 కాంస్యం) గెలుచుకుని మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మహిళల విభాగంలో బరిలోకి దిగిన 10 మందిలో 9 మంది పతకాలు సాధించడం విశేషం. ఇక అండర్-22 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 13 పతకాలను ఖాయం చేసుకుంది. వీటిలో 5 బంగారు పతకాల కోసం ఫైనల్స్‌కు వెళ్లారు.
మూడు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న భారత బాక్సర్లు:
నిషా (Nisha): మహిళల 54 కేజీల విభాగంలో చైనాకు చెందిన సిరుయి యాంగ్‌పై 4-1 తేడాతో విజయం సాధించి బంగారు పతకం గెలుచుకుంది.
ముస్కాన్ (Muskan): మహిళల 57 కేజీల విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన అయజాన్ ఎర్మెక్‌ను 3-2 తేడాతో ఓడించి బంగారు పతకం సాధించింది.
రాహుల్ కుందు (Rahul Kundu): పురుషుల 75 కేజీల విభాగంలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్‌జోన్ యాకుప్‌బోయేవ్‌ను ఓడించి బంగారు పతకం గెలుచుకున్నాడు.
