కొత్త కెప్టెన్ గా మోలినెక్స్

Australia Women's T20 team: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఒక కొత్త శకం మొదలైంది. స్టార్ ఆల్ రౌండర్ సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) ఆస్ట్రేలియా మహిళల టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు.క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిన్న) ఈ అధికారిక ప్రకటన చేసింది. అలిస్సా ప్రస్తుత కెప్టెన్ అలిస్సా హీలీ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో, ఆమె స్థానంలో సోఫీ మోలినెక్స్‌ను ఎంపిక చేశారు. భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుండి ఆమె కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత మార్చిలో వెస్టిండీస్ పర్యటన నుండి అన్ని ఫార్మాట్లలో (Test, ODI, T20) ఆమె పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.తహిలియా మెక్‌గ్రాత్‌తో పాటు స్టార్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ వైస్ కెప్టెన్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

మెల్బోర్న్ రెనెగేడ్స్ (WBBL), విక్టోరియా జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఆమెకు ఉండటంతో సెలెక్టర్లు ఆమె వైపు మొగ్గు చూపారు.మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ (WPL)లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2024 ఫైనల్‌లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి ఆర్సీబీ గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టుకు కెప్టెన్ కావడం విశేషం.వచ్చే నెల (ఫిబ్రవరి 15) నుండి భారత్‌తో జరగనున్న సిరీస్‌లో కెప్టెన్‌గా ఆమె తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story