Babar Azam Breaks Rohit Sharma’s World Record: రోహిత్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ అజామ్
రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ అజామ్

Babar Azam Breaks Rohit Sharma’s World Record: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
అతను రోహిత్ శర్మ ) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. బాబర్ అజామ్ 130 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 4,234 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. 123 ఇన్నింగ్స్‌ల్లో 39.57 సగటుతో 4,234 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. బాబర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 122.
నిన్న సైతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 టీ20WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

