పాక్ కు కొత్త కెప్టెన్

New Captain for Pakistan: ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ ప్రకటించిన జట్టులో స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్,మహమ్మద్ రిజ్వాన్లకు చోటు దక్కలేదు. ఈ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి ప్రధాన కారణం ఇటీవలి T20 ప్రదర్శన అని తెలుస్తోంది. గత కొంతకాలంగా వారి స్ట్రైక్ రేట్, ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొనే విషయంలో వారి పేలవమైన ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వారి స్థానంలో యువ, దూకుడుగా ఆడే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహిస్తాడు. సైమ్ ఆయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసన్ నవాజ్ వంటి యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. ఫఖర్ జమాన్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో కొనసాగుతారు.

ఈ సంచలన నిర్ణయం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, జట్టులో యువతకు, వేగవంతమైన ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇది వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా కూడా చూడవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story