Balwinder Singh Sandhu: బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం...అది తెలివైన నిర్ణయం
అది తెలివైన నిర్ణయం

Balwinder Singh Sandhu: మాజీ భారత క్రికెటర్ బల్వీందర్ సింగ్ సంధు, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకోవడంపై మద్దతు తెలిపారు. బుమ్రా ఫిట్ నెస్ ను కాపాడటానికి, అతని కెరీర్ ను పొడిగించడానికి ఇది ఒక మంచి నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక ఫాస్ట్ బౌలర్ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. నిరంతరంగా బౌలింగ్ చేస్తే గాయాలు తప్పవు. బుమ్రా లాంటి ఒక విలువైన ఆటగాడి ఫిట్నెస్ ను కాపాడటం చాలా ముఖ్యం. అందుకే అతనికి తరచుగా ఇచ్చే విశ్రాంతిని నేను పూర్తిగా సమర్థిస్తాను” అని సంధు అన్నారు. బుమ్రాకు ఇచ్చే విశ్రాంతి అనేది భవిష్యత్తు కోసం చేసే ఒక పెట్టుబడి అని అన్నారు. పంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లకు, కీలకమైన టెస్ట్ సిరీస్ లకు బుమ్రా పూర్తి ఫిట్ నెస్ తో ఉండాలి. అందుకే అనవసరమైన మ్యాచ్ లలో అతనికి విశ్రాంతి ఇవ్వడం మంచిదని అన్నారు.
తమ కాలంలో ఆటగాళ్లకు ఇన్ని అవకాశాలు ఉండేవి కావని, విశ్రాంతి తీసుకోవడం అంత సులభం కాదని సంధు గుర్తు చేసుకున్నారు. నేడు బుమ్రా లాంటి ఆటగాళ్లకు సైంటిఫిక్ పద్ధతుల్లో ఫిట్నెస్ ను నిర్వహిస్తున్నారని, ఇది భారత క్రికెట్ కు మంచి పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. బుమ్రాకు ఇచ్చే విశ్రాంతి సరైన నిర్ణయమని, ఇది అతని కెరీర్ కు, భారత క్రికెట్ కు మేలు చేస్తుందని సంధు అభిప్రాయపడ్డారు.
