Bangladesh Government Sports Advisor Asif Nazrul: ఐసీసీ ఒత్తిడికి తలొగ్గం..బెదిరింపులు కరెక్ట్ కాదు
బెదిరింపులు కరెక్ట్ కాదు

Bangladesh Government Sports Advisor Asif Nazrul: ఇండియాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడే అంశంలో ఐసీసీ ఇచ్చిన అల్టిమేటానికి తాము తలొగ్గబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పునరుద్ఘాటించాడు. ‘టోర్నీలో మా ప్లేస్‌లో వేరే జట్టును చేర్చుతున్నారనే అంశం నాకు తెలియదు. ఇలాంటి బెదిరింపులు సరైనవి కావు. బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గి ఐసీసీ అసమంజసమైన షరతులను విధించాలని చూస్తే మేం అంగీకరించం. గతంలో పాకిస్తాన్.. ఇండియాకు వెళ్లబోమని చెబితే వేదికలు మార్చారు. మేం కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నాం’ అని నజ్రుల్ పేర్కొన్నాడు. ఒకవేళ బంగ్లాదేశ్ వరల్డ్ కప్‌కు దూరమైతే దాని ప్లేస్‌లో స్కాట్లాండ్ (ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం)ను ఆడించే అవకాశాలు ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

