India A Team: ఇంగ్లండ్-ఏతో మల్టీ ఫార్మాట్ సిరీస్: భారత్-ఏ జట్లను ప్రకటించిన బీసీసీఐ
జట్లను ప్రకటించిన బీసీసీఐ

India A Team: స్వదేశంలో ఇంగ్లండ్ మహిళల ఏ జట్టుతో జరగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం వేర్వేరు భారత మహిళల-ఏ జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు అనుష్క శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, మల్టీ డే మ్యాచ్‌కు మిన్నూ మణి సారథ్యం వహించనుంది.
టీ20 సిరీస్ నవంబర్ 30న పుణెలో ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ కోసం ముంబైకి వెళ్తారు. డిసెంబర్ 19న వాంఖడే స్టేడియంలో మల్టీ-డే మ్యాచ్ జరగనుంది. టీ20, వన్డేల్లో మిన్నూ మణి వైస్ కెప్టెన్‌గా ఉండగా, మల్టీ డే మ్యాచ్‌లో తేజల్ హసబ్నిస్ వైస్ కెప్టెన్‌గా ఉంటారు.
శ్రేయాంక పాటిల్‌కు మూడు ఫార్మాట్లలోనూ అవకాశం దక్కింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో అద్భుత ప్రదర్శన తర్వాత ఆమె ఎంపికయ్యారు. మిన్ను మణి, షిప్రా గిరి, తనిషా సింగ్, సైమా ఠాకూర్ కూడా మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నారు.
టీ20 జట్టు: అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), వృందా దినేశ్, తనీషా సింగ్, సనికా చాల్కే, నికీ ప్రసాద్, జి. కమలిని, షిప్రా గిరి (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, వైష్ణవి శర్మ, ప్రేమ రావత్, సైమా ఠాకూర్, మోనికా పటేల్, కాశ్వీ గౌతమ్.
వన్డే జట్టు: అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), వృందా దినేశ్, తనీషా సింగ్, ప్రియా పునియా, నికీ ప్రసాద్, జి. కమలిని, షిప్రా గిరి (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, శ్రేయాంక పాటిల్, అమిషా బహుకండి, షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, అక్షితా భగత్, కాశ్వీ గౌతమ్.
మల్టీ డే జట్టు: మిన్ను మణి (కెప్టెన్), తేజల్ హసబ్నిస్ (వైస్ కెప్టెన్), శుభా సతీష్, ప్రియా పునియా, తనీషా సింగ్, పూర్వజా వెర్లేకర్, హెన్రియెట్టా పెరేరా, షిప్రా గిరి (వికెట్ కీపర్), ఉమా ఛేత్రి (వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, సైమా ఠాకూర్, అక్షితా భగత్, అమిషా బహుకండి, హ్యాపీ కుమారి, షబ్నమ్ షకీల్.

