Board of Control for Cricket in India (BCCI): సూర్యకుమార్‌కు జరిమానాపై బీసీసీఐ అప్పీల్.!
జరిమానాపై బీసీసీఐ అప్పీల్.!

Board of Control for Cricket in India (BCCI): ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు అతడికి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. ఈ జరిమానాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అప్పీల్ చేసింది.
సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఈ విజయాన్ని పుల్వామా ఉగ్రదాడి బాధితులకు, భారత సైనికులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. సూర్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ అంశాలతో కూడుకున్నవని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిబంధనల ప్రకారం, ఆటగాళ్లు రాజకీయ వ్యాఖ్యలు చేయడం నిషేధం. దీంతో, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ విచారణ అనంతరం సూర్యకుమార్‌కు జరిమానా విధించారు.
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పాకిస్థాన్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్ , సాహిబ్జాదా ఫర్హాన్ కూడా ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. హరీస్ రౌఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించగా, సాహిబ్జాదా ఫర్హాన్‌కు హెచ్చరిక మాత్రమే జారీ చేశారు. ఈ విషయంపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
