హెడ్ కోచ్ మార్పుపై బీసీసీ క్లారిటీ.!

BCCI Clarifies: సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓటమి తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వేటు వేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, తాజా రిపోర్టుల ప్రకారం, గంభీర్‌పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు అని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపాయి.

టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోమని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. టీమ్ ప్రస్తుతం మార్పు దశలో ఉందని, గంభీర్ 2027 ప్రపంచ కప్ వరకు కోచ్‌గా కాంట్రాక్ట్ కలిగి ఉన్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.జట్టును పునర్నిర్మించే గంభీర్ దీర్ఘకాలిక ప్రణాళికకు బోర్డు మద్దతు ఇస్తుందని సమాచారం. సౌత్ ఆఫ్రికా వైట్-బాల్ సిరీస్ ముగిసిన తర్వాత సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌తో కూడిన సమగ్ర సమీక్షా సమావేశం ఉంటుంది. అందులో టెస్ట్ టీమ్ పనితీరును ఎలా మెరుగుపరచాలనే అంశంపై చర్చించనున్నారు.

‘తన విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. ఇండియా క్రికెట్‌‌ ముఖ్యం, నేను కాదని కోచ్‌‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడే చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నా. ప్రజలు విజయాలను చాలా త్వరగా మర్చిపోతారు. ఎందుకంటే ఇంగ్లండ్‌‌లో యువ జట్టుతో ఫలితాలు సాధించిన వ్యక్తిని నేనేనన్న విషయం మర్చిపోయి కివీస్‌‌ చేతిలో వైట్‌‌వాష్‌‌ను గుర్తు పెట్టుకున్నారు. నేను చాంపియన్స్‌‌, ఆసియా ట్రోఫీని కూడా గెలిచిన వ్యక్తిని’ అని గంభీర్ అన్నారు. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story