ఆస్పత్రిలో రిషబ్ పంత్

Rishabh Pant Hospitalized: మైదానంలో గాయపడ్డ భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. పంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కాలికి గాయం కావడంతో పంత్ ను స్కాన్ల కోసం ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించింది. బీసీసీఐ మెడికల్ సిబ్బంది పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలిపింది.

అసలేం జరిగిందంటే..?

మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు గాయం అయ్యింది. ఇన్నింగ్స్ 68వ ఓవర్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు బంతి అతని కుడి కాలికి బలంగా తగిలింది. గాయం కారణంగా పంత్ కాలు వాచిపోయింది, రక్తస్రావం కూడా జరిగినట్టు కనిపించింది. నొప్పితో నడవడానికి కూడా అతను చాలా ఇబ్బంది పడ్డాడు.తీవ్రమైన నొప్పి కారణంగా పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయి మైదానం వీడాల్సి వచ్చింది. అతన్ని ఒక ప్రత్యేక వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు తరలించారు.

ఇంగ్లాండ్ గడ్డపై 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన తొలి ఓవర్సీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా పంత్ చరిత్ర సృష్టించిన తర్వాత ఈ గాయం జరగడం దురదృష్టకరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story