Cricket:బీసీసీఐ కీలక అప్ డేట్.. టీమిండియా షెడ్యూల్ మార్పు
టీమిండియా షెడ్యూల్ మార్పు

భారత జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడే టెస్టు మ్యాచ్‌ల వేదికల్లో స్వల్ప మార్పులు జరిగాయి. టీమిండియాతో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచులు ఆడనుంది. మొదటగా 2025 అక్టోబర్‌లో సౌతాఫ్రికా రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు రానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, రెండవ టెస్ట్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చింది బీసీసీఐ.
దీంతో పాటుగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ వేదికలను కూడా మార్చింది బీసీసీఐ. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి ఢిల్లీలో జరగాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చింది. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు తరలించింది.ఇండియా A, దక్షిణాఫ్రికా A మధ్య జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల వేదికలను కూడా బీసీసీఐ ఛేంజ్ చేసింది. ఈ మ్యాచ్‌లను బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి తరలించింది.
బీసీసీఐ కొత్త షెడ్యూల్
ఇండియా vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్
ఫస్ట్ టెస్ట్ - అక్టోబర్ 2 - 6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో
సెకండ్ టెస్ట్ - అక్టోబర్ 10 - 14 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో
భారత్ vs దక్షిణాఫ్రికా
మొదటి టెస్ట్ - నవంబర్ 14 - 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్
2వ టెస్టు - నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతిలో
