BCCI..సంపద ఎంతంటే.?

BCCI: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక బలం గణనీయంగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి BCCI నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 20,686 కోట్లుగా ఉంది. ఇది రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తం కావడం విశేషం.గత ఐదేళ్లలో (2019 నుండి 2024 వరకు) BCCI సంపద రూ. 14,627 కోట్లు పెరిగింది. 2019లో రూ. 3,906 కోట్లుగా ఉన్న జనరల్ ఫండ్ కూడా 2024 నాటికి రూ. 7,988 కోట్లకు చేరుకుంది.

ప్రధాన ఆదాయ వనరులు:

BCCI ఆదాయానికి ప్రధాన కారణాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆదాయంలో సింహభాగం వస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఐపీఎల్ ద్వారా రూ. 5,761 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మొత్తం ఆదాయంలో దాదాపు 59శాతం. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌ల మీడియా హక్కుల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వస్తుంది.

బ్యాంకుల్లో BCCI చేసిన భారీ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కూడా గణనీయమైన ఆదాయ వనరు. గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ద్వారా రూ. 986 కోట్లు ఆర్జించింది. ఐసీసీ వార్షిక ఆదాయంలో 38.5% వరకు వాటాను బీసీసీఐ పొందుతుంది. ఇది సుమారు రూ. 1,042 కోట్లు. స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ భాగస్వామ్యాలు ,మ్యాచ్ టికెట్ల అమ్మకాలు కూడా ఆదాయాన్ని పెంచుతున్నాయి.

BCCI తన పెరుగుతున్న ఆదాయంలో ఆటగాళ్లకు వేతనాలు, పన్నులు, దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీగా ఖర్చు చేస్తుంది. 2023-24లో పన్నుల కోసం రూ. 3,150 కోట్లు కేటాయించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story