టీమిండియాను ప్రకటించనున్న బీసీసీఐ

ODI World Cup Team: ఇవాళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ జట్టు ఎంపిక చేయనుంది. టీం ఎంపిక కమిటీ ముఖ్యంగా పేసర్లు రేణుకా సింగ్, ఓపెనింగ్ బ్యాటర్‌ షఫాలీ వర్మల స్థానంపై దృష్టి పెడుతుంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న రేణుకా సింగ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, షఫాలీ వర్మ స్థానాన్ని బెంగాల్ ప్లేయర్ ప్రతీక రావల్ భర్తీ చేసే అవకాశం ఉంది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ వంటి కీలక క్రీడాకారులు తప్పకుండా జట్టులో ఉంటారు. బౌలింగ్ విభాగంలో శ్రేయ శరణి, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ వంటి వారిలో ఎవరు జట్టులోకి వస్తారనేది ఆసక్తికరంగా ఉంది. స్పిన్ విభాగంలో రాధా యాదవ్ , స్నేహ రాణా కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ ప్రపంచ కప్ సెప్టెంబర్ 30, 2025 నుంచి భారత్, శ్రీలంక వేదికలలో జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 30న శ్రీలంకతో ఆడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story