Ben Stokes Bids: ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది! ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టే తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అంటూ సంచలన ప్రకటన చేశాడు.

రిటైర్మెంట్ వార్త ప్రపంచానికి తెలిసిన కొద్దిసేపటికే.. మైదానంలో స్టోక్స్ తన మార్క్ చూపించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తను వేసిన తొలి బంతికే జాక్ ఫాక్స్ వికెట్‌ను పడగొట్టి.. తన ఖాతాలో మరో వికెట్ వేసుకున్నాడు. లండన్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరంగా ఉన్న స్టోక్స్.. ప్రస్తుతం నాటింగ్హామ్‌లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. తాను మరో వారం రోజులు మాత్రమే జట్టులో ఉంటానని అతడు ముందే స్పష్టం చేశాడు.

ఈ వీడ్కోలు ప్రకటనకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో స్టోక్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సహచర ఆటగాళ్లతో మాట్లాడుతూ.. "రిటైర్మెంట్ కారణాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ, ఈ జట్టు కోసం నేను ఎన్నోసార్లు కష్టపడ్డాను. ఇప్పుడు మరోసారి మనమంతా కలిసి పోరాడాల్సి ఉంది. ఫలితం ఎలా ఉన్నా.. మన శక్తినంతా ధారపోసి, పూర్తి సంతృప్తితో మైదానాన్ని వీడాలి. అదే నా కోరిక" అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు.

గత 15 ఏళ్లుగా ఇంగ్లాండ్ జట్టుకు నమ్మసక్యం కాని సేవలు అందించాడు బెన్ స్టోక్స్. తన కెరీర్‌లో 122 టెస్టులు ఆడి, అందులో 44 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. ముఖ్యంగా 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక గొప్ప ఫైటర్‌గా, కెప్టెన్‌గా ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో బెన్ స్టోక్స్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story