వరల్డ్ కప్ నుంచి ఇషాన్ మలింగ అవుట్!

Big Blow to Sri Lanka: శ్రీలంక క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు ఆ జట్టు స్టార్ పేసర్ ఇషాన్ మలింగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ భుజానికి గాయం కావడంతో అతను ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇషాన్ మలింగ స్థానంలో 32 ఏళ్ల అనుభవజ్ఞుడైన పేసర్ ప్రమోద్ మదుషాన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మదుషాన్ ఇప్పటివరకు 13 వన్డేలు, 8 టీ20లు ఆడిన అనుభవం ఉంది. 2023 ఏప్రిల్ తర్వాత అతను మళ్లీ టీ20 ఫార్మాట్‌లో అవకాశం దక్కించుకోవడం విశేషం. మతీషా పతిరానా, దుష్మంత చమీర వంటి స్టార్ బౌలర్లతో కూడిన లంక పేస్ విభాగంలో మదుషాన్ చేరిక జట్టుకు బలాన్నిస్తుందని యాజమాన్యం భావిస్తోంది.

దాసున్ శనక సారధ్యంలోని శ్రీలంక జట్టు ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. 2014లో ఛాంపియన్లుగా నిలిచిన లంక జట్టు, ఈసారి సొంత గడ్డపై ఆ మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే ధనంజయ డిసిల్వా వంటి సీనియర్‌ను పక్కన పెట్టి, కమిందు మెండిస్‌ను జట్టులోకి తీసుకున్న లంక.. ఇప్పుడు మలింగ స్థానంలో మదుషాన్‌తో బరిలోకి దిగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story