Rohit and Kohli: అఫ్గాన్ క్రికెట్ టీమ్ ఈ ఏడాది భారత్ లో పర్యటించనుంది. జూన్ 6-నుంచి20 మధ్య ఇండియాతో ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడనుంది. భారత జట్టుకు గిల్ కెప్టెన్సీ వహించనుండగా వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ ను అలరించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది. జూన్ 6న న్యూ చండీగర్ లో ఏకైక టెస్ట్, తొలి వన్డే 14న ధర్మశాలలో, 17న లక్నోలో సెకండ్ వన్డే, 20న చెన్నై వేదికగా మ్యాచ్ నిర్వహించనున్నారు. వన్డే మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభంకానున్నాయి.

అంతర్జాతీయ టీ 20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ స్టార్ ప్లేయర్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (రో-కో) జోడీ రీఎంట్రీకి డేట్ ఫిక్స్ కావడంతో ఫ్యాన్పుల్ ఖుషీ అవుతున్నారు.ఆఫ్ఘానిస్తాన్ సిరీస్ అనంతరం కోహ్లీ, రోహిత్‌లు ఇంగ్లండ్ తో జరిగే వైట్‌బాల్ పర్యటనలో పాల్గొంటారు. జూలై 1వ తేదీ నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. వన్డే మ్యాచ్‌లు జూలై 14 నుంచి స్టార్ట్ కానున్నాయి.

అయితే అంతకంటే ముందు ఐపీఎల్లో ముంబై తరపున రోహిత్ శర్మ, బెంగళూరుకు ఆడుతూ కోహ్లి అలరించనున్నారు. ఇక వీరిద్దరూ చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ బరిలో దిగిన సంగతి సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story