జట్టులో కొనసాగించాలి:గంగూలీ

Ganguly: మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రస్తుత భారత క్రికెట్, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులు అసాధారణమైనవని గంగూలీ ప్రశంసించారు. ఫామ్‌లో ఉన్నంత కాలం వారు జట్టులో కొనసాగాలని, వారి ప్రదర్శన ఆధారంగానే ఎంపిక జరగాలని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరూ ఫామ్‌లో ఉంటే 2027 ప్రపంచకప్ వరకు కూడా ఆడగలరని అభిప్రాయపడ్డారు.

భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని, దేశంలో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని గంగూలీ అన్నారు. దేశీయ క్రికెట్, ఐపీఎల్, భారత్ ఏ, అండర్-19 జట్లు బలమైన పునాదిని అందిస్తున్నాయని, అందుకే కొత్త ఆటగాళ్లు నిరంతరం వస్తూనే ఉంటారని చెప్పారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌గా ఉజ్వల భవిష్యత్తు ఉందని గంగూలీ ప్రశంసించారు.

రాబోయే ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో భారత్‌ బలంగా ఉందని, టోర్నమెంట్‌ ఫేవరెట్‌గా నిలుస్తుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. గంగూలీ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఉన్న చర్చనీయాంశంగా మారాయి. అలాగే సభ్యులు కోరుకుంటే క్యాబ్ పోస్టుకు నామినేషన్ వేస్తానని చెప్పాడు గంగూలి. అలాగ2015 నుంచి 2019 వరకు గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story