Captain Suryakumar Yadav: శభాష్.. క్రీడా స్ఫూర్తిని చాటుకున్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్
కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్

Captain Suryakumar Yadav: ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. ఒక బ్యాట్స్‌మన్‌ను అప్పీల్ చేసి అవుట్ చేసిన తర్వాత, అప్పీల్‌ను ఉపసంహరించుకొని తిరిగి బ్యాటింగ్‌కు పిలవడం ద్వారా సూర్య అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి యూఏఈ జట్టును కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు, శివమ్ దూబే 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం సరైందని భారత బౌలర్లు నిరూపించారు. యూఏఈ బ్యాట్స్‌మెన్‌లను పూర్తిగా కట్టడి చేశారు.యూఏఈ జట్టు కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టీ20 ఫార్మాట్‌లో భారత్‌పై ఏదైనా జట్టు సాధించిన అత్యల్ప స్కోరు. అలాగే, ఇది యూఏఈ జట్టుకు కూడా టీ20ల్లో అత్యల్ప స్కోరు.58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.ఈ మ్యాచ్ కేవలం 106 బంతుల్లోనే ముగిసింది, ఇది టీ20 క్రికెట్‌లో ఒక రికార్డు.
