6 నిమిషాల్లో 1.2కి.మీ పరుగెత్తాల్సిందే..

Bronco Test for Team India Players: ఇండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌ ప్రమాణాలను మెరుగుపరచడానికి బీసీసీఐ కొత్తగా 'బ్రోంకో టెస్ట్' అనే ఒక ఫిట్‌నెస్ టెస్ట్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే యో-యో టెస్ట్, 2 కి.మీ. టైమ్ ట్రయల్ వంటి టెస్టులు ఉన్నప్పటికీ, ఈ కొత్త టెస్ట్‌ను భారత క్రికెట్ జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆద్రియాన్ లే రౌక్స్ సూచన మేరకు తీసుకొచ్చారు.

బ్రోంకో టెస్ట్ అంటే ఏమిటి?

బ్రోంకో టెస్ట్' అనేది రగ్బీ క్రీడ నుంచి తీసుకొన్న ఒక కఠినమైన ఏరోబిక్ ఫిట్‌నెస్ పరీక్ష. ఇందులో ఆటగాళ్లు షటిల్ రన్‌లు చేయాల్సి ఉంటుంది.

ఆటగాడు 20 మీటర్లు పరుగెత్తాలి...తరువాత, 40 మీటర్లు పరుగెత్తి వెనక్కి రావాలి...చివరగా, 60 మీటర్లు పరుగెత్తి వెనక్కి రావాలి.. ఇలా చేయడం ఒక సెట్ అవుతుంది. ఆటగాళ్లు ఎలాంటి బ్రేక్ లేకుండా ఇలాంటి ఐదు సెట్లు పూర్తి చేయాలి. మొత్తం దూరం 1200 మీటర్లు (1.2 కి.మీ). భారత ఆటగాళ్లు ఈ టెస్ట్‌ను 6 నిమిషాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ టెస్ట్‌ను ఎందుకు ప్రవేశపెట్టారు?

భారత ఫాస్ట్ బౌలర్లు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతూ, సరైనంతగా రన్నింగ్ చేయడం లేదని గమనించారు. ఈ టెస్ట్ వారిలో ఓర్పు, ఫిట్‌నెస్‌ను పెంచుతుంది.ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిని పెంచడం, క్రీడాకారులకు నిరంతరం అత్యుత్తమ ఫిట్‌నెస్ ప్రమాణాలను నిర్ధారించడం ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశ్యం.2025 ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ వంటి ముఖ్యమైన సిరీస్‌లలో భారత ఆటగాళ్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు, గాయాల బారిన పడటం వల్ల ఈ టెస్ట్‌ను తీసుకొచ్చారు.ప్రస్తుతం, భారత జట్టులోని కాంట్రాక్ట్ ఆటగాళ్లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో ఈ టెస్ట్‌ను తీసుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story