BWF World Championships: బ్యాడ్మింటన్ ప్రపంచ వేదికపై భారత్ జెండా రేగింది.బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మన యువ షట్లర్లు అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయాలు నమోదు చేశారు. ముఖ్యంగా, చైనా దిగ్గజం, వరల్డ్ నంబర్ వన్ ఆటగాడికి మన కుర్రాడు చెక్ పెట్టాడు.

"మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఇండియా యంగ్‌ షట్లర్ ఆయుష్‌ శెట్టి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ షి యు క్వి (చైనా)తో తలపడిన ఆయుష్‌.. అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. గంటా 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆయుష్‌ 21–14, 13–21, 21–19 తేడాతో షి యు క్విపై సంచలన విజయం సాధించాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న ఆయుష్‌, రెండో గేమ్‌ కోల్పోయినా.. డిసైడర్‌లో మాత్రం తన సత్తా చాటాడు. చివరిలో 20–20 స్కోరు వద్ద ఒత్తిడిని జయించి, వరుసగా రెండు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

"ఇక రికార్డు స్థాయిలో ఆరో పతకం వేటలో ఉన్న తెలుగు తేజం పీవీ సింధు కూడా తన జోరును కొనసాగించింది. తొలి రౌండ్‌లో సింధు 21–7, 21–11తో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌పై అలవోక విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ టోర్నీలో ఇప్పటికే ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలిచిన సింధు.. మరో పతకంపై కన్నేసింది."

PolitEnt Media

PolitEnt Media

Next Story