కెప్టెన్ గిల్ ఏమన్నారంటే..?

Captain Gill Speaks: భారత క్రికెట్ జట్టుకు కొత్తగా వన్డే సారథిగా ఎంపికైన శుభ్‌మన్‌ గిల్.. జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ నెలకొల్పిన స్నేహపూర్వక వాతావరణాన్ని తానూ కొనసాగిస్తానని వ్యాఖ్యానించారు. వెస్టిండీస్‌తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు నేపథ్యంలో గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఆయన కెప్టెన్సీపై మాట్లాడారు.

రోహిత్-విరాట్ భవితవ్యంపై...

రోహిత్ శర్మ చాలా ప్రశాంతంగా ఉంటాడని, కెప్టెన్‌గా ఉంటూ జట్టులో ఆయన నెలకొల్పిన స్నేహపూరిత వాతావరణాన్ని తానూ కొనసాగిస్తానని గిల్ అన్నారు. అలాగే, రోహిత్, విరాట్ కోహ్లీ వన్డేల భవితవ్యంపై వస్తున్న ఊహాగానాల గురించి ఆయన స్పందించారు. "వారు టీమిండియాను ఎన్నో మ్యాచుల్లో గెలిపించారు. వారిద్దరూ అద్భుతమైన నైపుణ్యం కలిగిన క్రికెటర్లు. జట్టుకు వారిద్దరూ చాలా అవసరం. వచ్చే వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా వారి సన్నద్ధత జరుగుతోంది" అని గిల్ స్పష్టం చేశారు.

వర్తమానంలో ఉండేందుకే ఇష్టపడతా"

మున్ముందు మూడు ఫార్మాట్లలోనూ గిల్‌కే సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. "భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే, నేనెప్పుడూ వర్తమానంలో ఉండేందుకే ఇష్టపడతా. ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకుసాగుతాం. రాబోయే కొన్ని నెలలు మాకు చాలా ముఖ్యం" అని శుభ్‌మన్‌ గిల్ అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story