Captain Shubman Gill: గిల్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లేది ఎప్పుడంటే..?
వెళ్లేది ఎప్పుడంటే..?

Captain Shubman Gill: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కోల్‌కతా టెస్ట్‌లో గాయపడటంతో జట్టుకు తాత్కాలిక నాయకత్వ మార్పులు అనివార్యమయ్యాయి. ఈ గాయం కారణంగా గిల్ రెండో టెస్ట్ మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
కెప్టెన్సీ మార్పులు
రెండో టెస్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
గిల్‌కు గాయం ఎలా అయ్యింది?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడే సమయంలో మెడ కండరం పట్టేయడంతో అతను బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. ఒక రోజు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండి డిశ్చార్జి అయ్యాడు. అయితే ఈ గాయం వర్క్‌లోడ్ వల్ల కాదని నిద్రలేమి వల్లే కండరం పట్టేసిందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వివరణ ఇచ్చారు.
టీ20 సిరీస్‌కు గిల్ అందుబాటుపై సందిగ్ధత
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న శుభ్‌మన్ గిల్, డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఓ వారం ముందు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకునే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీ20 సిరీస్‌కు కూడా గిల్ అందుబాటులోకి వస్తాడా అనే విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పష్టత లేదు.

