Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్,కోహ్లీ సెంచరీల మోత
రోహిత్,కోహ్లీ సెంచరీల మోత

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ (2025-26) తొలి రోజే భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వీరిద్దరూ సెంచరీలతో అభిమానులను అలరించారు.రోహిత్ శర్మ జైపూర్‌లో సిక్కిం జట్టుపై వీరవిహారం చేశాడు. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది రోహిత్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీ. 94 బంతుల్లో155 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ విధ్వంసంతో ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న విరాట్ కోహ్లీ, బెంగళూరులో ఆంధ్ర జట్టుపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన క్లాస్ ఆటతీరుతో కేవలం 83 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.
101 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్‌లో 16,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.దీంతో ఢిల్లీ ఏపీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (బిహార్) కూడా కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది 190 పరుగులతో రికార్డు సృష్టించాడు. బిహార్ జట్టు ఈ మ్యాచ్‌లో 574 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

