నాథన్ ఎల్లిస్ కు గాయం

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ నాథన్ ఎల్లిస్ (Nathan Ellis) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ఇటీవల జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో నాథన్ ఎల్లిస్ కాలి కండరాల గాయానికి గురయ్యాడు.స్కాన్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ గాయం తగ్గడానికి కనీసం 6 నుండి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీనివల్ల అతను ఈ సీజన్ ఆడే అవకాశం లేదు.
నాథన్ ఎల్లిస్ తన వైవిధ్యమైన స్లోయర్ బాల్స్ , యార్కర్లతో డెత్ ఓవర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్. పతిరానతో కలిసి అతను కీలక పాత్ర పోషిస్తాడని మేనేజ్మెంట్ భావించింది. చెన్నై జట్టులో విదేశీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఇప్పుడు కొంత లోటు కనిపిస్తోంది.
ప్రత్యామ్నాయం ఎవరు?
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, చెన్నై మేనేజ్మెంట్ ముగ్గురు ఆటగాళ్లను పరిశీలిస్తోంది.దుష్మంత చమీర శ్రీలంక స్పీడ్‌స్టర్, ఇతనికి ఐపీఎల్ అనుభవం ఉంది.మ్యాట్ హెన్రీ న్యూజిలాండ్ బౌలర్, పవర్ ప్లేలో వికెట్లు తీయగలడు.ఎల్లిస్ తరహాలోనే వేగంగా బౌలింగ్ చేయగల యువ ఆటగాడి కోసం వెతుకుతున్నారు.
అధికారికంగా రీప్లేస్‌మెంట్ పేరును చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు. బహుశా ఇవాళ సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

