Chess World Cup in India: ఇండియాలో చెస్ వరల్డ్ కప్..ఎప్పటి నుంచి అంటే.?
ఇండియాలో చెస్ వరల్డ్ కప్..ఎప్పటి నుంచి అంటే.?

Chess World Cup in India: 23 ఏళ్ల తర్వాత చెస్ వరల్డ్ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. 2025 FIDE వరల్డ్ కప్ (ఓపెన్) ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27, 2025 వరకు జరగనుంది. 206 మంది చెస్ ఆటగాళ్ళు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటారు. ఇది నాకౌట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. అంటే ప్రతి రౌండ్‌లో ఓడిపోయిన ఆటగాడు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తాడు. 2021 నుంచి సింగిల్-ఎలిమినేషన్ ఫార్మాట్‌ను అనుసరిస్తున్నారు.
ఈ టోర్నమెంట్‌లో గెలిచిన టాప్ 3 ఆటగాళ్ళు 2026 లో జరిగే FIDE కాండిడేట్స్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్, ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విశ్వనాథన్ ఆనంద్ వంటి భారతదేశపు ప్రముఖ గ్రాండ్‌మాస్టర్లు చాలా మంది ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అర్హత సాధించారు. ప్రస్తుతానికి సుమారు 20 మంది భారతీయ ఆటగాళ్ళు అర్హత సాధించారు. వేదిక ఇంకా ఖరారు కాలేదు. గోవా లేదా అహ్మదాబాద్ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF) త్వరలో తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
చివరిసారిగా 2002లో హైదరాబాద్‌లో FIDE వరల్డ్ కప్ జరిగింది. ఆ టోర్నమెంట్‌లో విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచారు.2000 సంవత్సరంలో ఢిల్లీలో నాకౌట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ జరిగింది. అయితే ఫైనల్ టెహ్రాన్‌లో నిర్వహించారు.
