గోల్డ్, సిల్వర్ మెడల్

Archer Taniparthi Chikita: తెలంగాణ క్రీడారంగం మరోసారి ప్రపంచ వేదికపై దూసుకుపోయింది! ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్-1లో మన తెలుగు తేజం, స్టార్ ఆర్చర్ తానిపర్తి చికిత అద్భుత ప్రదర్శనతో మెరిసింది. ఒక గోల్డ్, ఒక సిల్వర్ మెడల్స్‌తో భారత్‌కు గర్వకారణంగా నిలిచింది.

ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది 'కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్' ఫైనల్. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన చికిత మరియు రజత్ చౌహాన్ జోడీ.. మైదానంలో పక్కా వ్యూహంతో కదిలారు. ఫైనల్ పోరులో మలేసియా జట్టుతో తలపడిన ఈ జంట, ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడింది. చివరికి 158-156 స్కోరుతో ప్రత్యర్థిని మట్టికరిపించి, పసిడి పతకాన్ని ముద్దాడింది. చికిత సంధించిన ఒక్కో బాణం మలేసియా విజయవకాశాలను తుత్తునియలు చేస్తూ బంగారు విజయాన్ని ఖాయం చేసింది.

కేవలం మిక్స్‌డ్ ఈవెంట్‌లోనే కాకుండా, వ్యక్తిగత విభాగంలోనూ చికిత తన సత్తా చాటి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తన అద్భుతమైన టెక్నిక్ ,ఏకాగ్రతతో తెలంగాణ ఆర్చరీకి అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు తెచ్చింది. ఒకే టోర్నీలో రెండు మెడల్స్ సాధించడం చికితలోని పట్టుదలకు, కఠోర శ్రమకు నిదర్శనం. నేడు తెలంగాణ గల్లీ నుంచి అంతర్జాతీయ వేదికల వరకు చికిత పేరు మారుమోగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story