First Time Ever for Australia: క్లీన్ స్వీప్.. ఆస్ట్రేలియాకు ఇదే మొదటి సారి
ఆస్ట్రేలియాకు ఇదే మొదటి సారి

First Time Ever for Australia: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లోనూ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్‌ఓడిన విండీస్19.4 ఓవర్లలో 170 రన్స్‌కు ఆలౌటైంది. హెట్‌మయర్(52), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (35), జేసన్ హోల్డర్ (20) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. బెన్ ద్వార్షుయిస్ 3 వికెట్లు తీశాడు. టీ20 ఫార్మాట్‌లో 5-0తో క్లీన్ స్వీప్ చేయడం ఆస్ట్రేలియాకు ఇదే మొదటిసారి.
తర్వాత ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 173/7 స్కోరు చేసి నెగ్గింది. మిచెల్‌ఓవెన్ (37) టాప్ స్కోరర్. కామెరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్(30), ఆరోన్ హ్యార్డీ (28 నాటౌట్) రాణించారు. బెన్ ద్వార్షుయిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఈ సిరీస్‌లో మొత్తం 205 రన్స్ చేసిన గ్రీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇక టీ20 ఫార్మాట్ సిరీస్‌లో లక్ష్య ఛేదనలో ఇన్ని రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ టూర్‌లో కంగారూలు మూడు టెస్ట్‌లు, ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి పర్ఫెక్ట్ 8–0తో రికార్డులకెక్కింది.
