CM Revanth: తిలక్ వర్మకు సీఎం రేవంత్ సన్మానం
సీఎం రేవంత్ సన్మానం

CM Revanth: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. ఆసియా కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ మంగళవారం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శనతో భారతదేశానికి , తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చారని అభినందించారు. తిలక్ వర్మకు శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి సత్కరించారు.
ఈ సందర్భంగా తిలక్ వర్మ ముఖ్యమంత్రికి తన క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆ బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతున్నట్లు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వకటి శ్రీహరి, పలువురు క్రీడా అధికారులు కూడా పాల్గొన్నారు.
ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మతో పాటు, మహ్మద్ సిరాజ్‌లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా సన్మానించనుంది. వారికి చెరో రూ.10 లక్షల బహుమతిని ప్రకటించింది. ఆసియా కప్ విజయం తర్వాత తిలక్ వర్మ తన తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచకప్ గెలవడమే అని, ఆ కప్ గెలిచే వరకు తనకు నిద్ర పట్టదని మీడియాకు తెలిపారు
