గుండెపోటుతో కోచ్ మృతి

Coach Dies of Heart Attack: సెర్బియన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా రాడ్నిచ్కి టీమ్ హెడ్ కోచ్ మ్లాడెన్ జిజోవిక్ గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. మ్లాడోస్ట్ లూకానీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా సైడ్‌లైన్‌లో.

గుండెపోటుతో కుప్పకూలిన వెంటనే మ్యాచ్ నిలిపివేయబడింది. అత్యవసర వైద్య సాయం అందించారు, కానీ ఆయనను కాపాడలేకపోయారు. ఈ విషాదకర వార్త తెలియగానే ఆటగాళ్లు, సిబ్బంది తీవ్ర దుఃఖానికి గురయ్యారు. రాడ్నిచ్కి 1923 క్లబ్ , సెర్బియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (FSS) ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాయి. ఆయన కుటుంబానికి ,స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి.

మ్లాడెన్ జిజోవిక్ 1980, డిసెంబర్ 27 న రొగాటికాలో జన్మించారు. కెరీర్ మొత్తంలో మిడ్‌ఫీల్డర్‌గా ఆడి, రాడ్నిక్ బిజెల్జినా, రుడార్ ఉగ్ల్జెవిక్, జ్రింజ్‌స్కీ మోస్టర్, KF టిరానా, బోరాక్ బంజా లుకా వంటి అనేక క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. 2017లో కోచ్‌గా మారారు. రాడ్నిక్ బిజెల్జినా, జ్రింజ్‌స్కీ మోస్టార్, స్లోబోడా తుజ్లా, బోరాక్ బంజా లుకా, అల్-ఖోలూద్ (సౌదీ అరేబియా) వంటి జట్లకు కోచ్‌గా పనిచేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story