సీఐడీ ఏడీజీ, ఎన్ఫ్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ డీజీలకు ఫిర్యాదు చేసిన ఎంఏఫహీమ్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి సంబంధించి సీనియర్‌, జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుల ఎంపిక హెచ్‌సీఏ బైలాస్‌కి విరుద్దంగా జరిగిందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఏఫహీమ్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫహీమ్‌ సీఐడీ అడిషనల్‌ డీజీపీ, విజిలెన్స్‌ ఎన్ఫ్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ, హెచ్‌సీఏ సీనియర్‌, జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపికపై ఫిర్యాదు చేశారు. సెలక్షన్‌ కమిటీలో సభ్యులగా ఉండాల్సిన కనీస అర్హతలు లేకపోయినా కమిటీ సభ్యులగా నియమించడం జరిగిందని ఫహీమ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యులుగా ఉండాలంటే కనీసం 7 టెస్ట్‌ మ్యాచుల్లో ప్లేయర్‌గాగానీ 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులు కానీ 10 ఇంటర్నేషనల్‌ మ్యాచులలో పాటు 20 ఫస్ట్‌ క్లాస్‌ మాచ్‌లైనా ఆడి ఉండాలని అలాగే సెలక్షన్‌ కమిటీలో సభ్యులు కావాలంటే కనీసం 5ఏళ్ళ ముందే రిటైర్‌ అయి ఉండాలనే నిబంధనలు ఉండగా ఇందులో ఏ ఒక్కటీ పాటించలేదని ఫహీమ్‌ ఫిర్యాదు చేశారు. ఇక చైర్పర్సన్‌గా సీనియర్‌ మోస్ట్‌ కెప్టెన్‌ ఉన్న వ్యక్తి ఉంటారు కానీ హెచ్‌సీఏ నియమించిన చైర్మన్‌ విషయంలో అలా జరగలేదని ఫహీమ్‌ పేర్కొన్నారు. సీనియర్ కమిటి సభ్యుల్లో కేవలం ఎన్‌పీసింగ్‌, ఆకాష్‌ బండారిలకు మినహా చైర్మన్‌తో సహా మిగిత ఎవరికీ సెలక్షన్‌ కమిటీలో ఉండే అర్హత లేదని ఎంఏఫహీమ్‌ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు.

అలాగే జూనియర్ సెలక్షన్ కమిటి సభ్యులుగా ఉండాలంటే 25 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడి ఉండాలని ఇది కుడా రిటైర్మెంట్ తీసుకొని 5 ఏళ్లు అయి ఉండాలని, సీనియర్ మోస్ట్ మెంబెర్ ఛైర్పర్సన్ గా ఉంటారని పేర్కొన్నారు. అయితే ఈ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుల విషయంలో కూడా నిబంధనల ప్రకారం ఎంపిక జరగలేదని ఫహీమ్‌ ఫిర్యాదు చేశారు. ఈ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలో కూడా సుదీప్‌ త్యాగి, అరవింద్ శెట్టిలు మినహా మిగిలిన ఎవ్వరికీ కమిటో సభ్యులుగా ఉండే అర్హత లేదని ఫహీమ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ బైలాస్‌ కు విరుద్దంగా ఈ నియమకాలు జరిగాయి కాబట్టి తగిన చర్యలు తీసుకుని కమిటీల నుంచి అనర్హులను తక్షణం తొలగించాలని సీఐడీ అడిషనల్‌ డీజీపీ, విజిలెన్స్‌ డీజీ, ఎన్ఫ్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు చేసిన ఫిర్యాదులో ఎంఏఫహీమ్‌ పేర్కొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story